ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థిని బలవన్మరణం

  • సోమవారం తన గదిలో ఉరివేసుకున ఆత్మహత్యకు పాల్పడిన ఎంటెక్ ఫస్టియర్ విద్యార్థిని మానసిక ఒత్తిడికి లోనవుతున్నానంటూ లేఖ రాసి బలవన్మరణం
  • ఒడిశాకు చెందిన మృతురాలు  
  • గత నెలలోనే ఎంటెక్‌లో చేరినట్టు వెల్లడి
ఐఐటీ హైదరాబాద్‌లో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మమైత నాయక్ మానసిక ఒత్తిడి కారణంగా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గతనెలలో మరో విద్యార్థి కార్తిక్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో మమైత నాయక్ ఇలా బలవంతంగా జీవితాన్ని ముగించడం కలకలం రేపుతోంది. 

సంగారెడ్డి గ్రామీణ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మమైత నాయక్ సోమవారం తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. గత నెల 26నే ఆమె ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరింది. ఆ రోజు సాయంత్రం ఇతర విద్యార్థులు జరిగిన దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడికి గురవుతున్నా’’ అని రాసున్న లేఖ మమైత గదిలో పోలీసులకు లభించింది.

IIT Hyderabad
Hyderabad
Telangana
Odish

More Telugu News